ఓ యువకుడి కడుపులోంచి వైద్యులు 56 రేజర్ బ్లేడ్లను వెలికితీసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. జలోర్ జిల్లా సంచోరకి చెందిన యశ్ పాల్ సింగ్(25) అనే యువకుడు సోమవారం అస్వస్థతకు గురై రక్తం కక్కుకున్నాడు. దీంతో అతడి స్నేహితులు ఆస్పత్రికి తరలించగా, కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు వైద్యులు X-ray ద్వారా గుర్తించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్స ద్వారా మొత్తం 56 బ్లేడ్లను వెలికి తీశారు.