ఏపీ జేఏసీ అమరావతి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ గుంటూరు పిలుపుమేరకు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గత రెండు రోజుల నుంచి వివిధ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. డిఎలు చెల్లించాలని పెండింగ్ బకాయాలను త్వరలో విడుదల చేయాలని పిఎఫ్ డబ్బులు సరెండర్ లీవులు పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, డిప్యూటీ తాసిల్దార్ ఫణికుమార్, డిటి నేలబట్ల వాసు, నల్లూరి ప్రసాద్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.