శ్రీకాళహస్తి లోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్నవరదరాజుల స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా ఈనెల 17వ తేదీన ధ్రువ మూర్తి విగ్రహం పంచనామా చేపట్టాలని నిర్ణయించినట్లు ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వరదూని ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు