టిడిపి వాల్మీకి సాధికార కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తలారి మస్తానప్పకు టిడిపి నాయ కులు సన్మానించారు. మంగళవారం గుంతకల్లులోని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయం లో సన్మాన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ తలారి మస్తానప్ప పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగిందని భవిష్యత్తు లో ఆయన మరిన్ని పదవులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి రాయల్ రామయ్య, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్. కృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa