ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త‌ప్పుడు ప్ర‌చారాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరిన మంత్రి బుగ్గ‌న‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 02:02 PM

గవర్నర్ ప్రసంగంలో దిశచట్టంపై అబద్ధాలు చెప్పించారనే ఆరోపణపైనా బుగ్గన తీవ్రంగా స్పందించారు. వాస్తవాలను సభలో వివరించారు. గౌరవ గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి, చ‌ట్ట‌స‌భ‌ను అవమానించే రీతిలో ఎల్లో మీడియా బాధ్యతారహితంగా రాస్తున్న తప్పుడు కథనాలను ప్రజల ముందు ఎండగట్టారు. `రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళలపట్ల నేరాలకు పాల్పడేవారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి మైలురాయిగా పరిగణించదగ్గ దిశ బిల్లును చేపట్టడమైంది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఓ చట్టాన్ని తెచ్చి, దాన్ని అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్ ఆమోదాన్ని పొంది, 2021లో కేంద్రానికి పంపింది.  ఇప్పటి వరకూ ఆ బిల్లు కు సంబంధించి క్లారిఫికేషన్స్, రిప్లయ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. కానీ, ప్రతిపక్ష టీడీపీ అసలు దిశ బిల్లే లేదని తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.  మహిళలకు భద్రత అందించేందుకు గొప్ప సదుద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. తప్పుడు వార్తలతో గౌరవ సభను, సభ్యులను, గవర్నర్ ను అవమానిస్తూ కథనాలు రాసిన పత్రికలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది`గా స్పీకర్ త‌మ్మినేని సీతారాంను మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa