ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరుపై ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే ఆలోచ‌న చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 02:01 PM

జనసేన పార్టీ వల్ల ప్రజలకు పెద్దగా ఉపయోగం లేనప్పటికీ,, ఆశగా ఎదురుచూసిన ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం నిరాశ పరిచిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సభలో గంటన్నర పాటు సుదీర్ఘంగా మాట్లాడిన పవన్‌ మాటల్లో ఆ పార్టీ విధివిధానాలు, అజెండా, భవిష్యత్తు కార్యాచరణ లేకపోవడం హేయమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ... 175 నియోజకవర్గాల్లో పోటీచేస్తావా అంటే సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇంకో రాజకీయ పార్టీతో కలిసి వెళ్తానని నేరుగా చెప్పే ధైర్యం లేదు. చివరకు నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను ఎవరికి అమ్ముడుపోయినా సరే దాంట్లో మీరు భాగస్వాములు కండి.. మిమ్మల్ని అందరినీ కలిసి తాకట్టుపెట్టేస్తానని పవన్‌ చెబుతున్నాడు. ఇక్కడ మీ పార్టీ నాయకులకు దమ్ము, ధైర్యం లేదు అనుకుంటే తెలంగాణలో పోటీ చేయొచ్చు కదా.. తెలంగాణలో ఒక పార్టీతో, ఏపీలో ఒక పార్టీతో, కేంద్రంలో ఒక పార్టీతో, రాష్ట్రంలో మరో పార్టీతో పొత్తు ఎందుకు  అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa