ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగ్రామ పాదయాత్రలను జయప్రదం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 02:01 PM

మైదుకూరు నియోజకవర్గం ఎం. ఈ. ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, ఎంఎంఎస్, అనుబంధ సంఘాల సమావేశం బుధవారం మైదుకూరు టౌన్ 22 వార్డు లోని జోసఫ్ పేటలో జరిగింది. ఈ సమావేశం లో కడప జిల్లాలో జరుగు మాదిగ సంగ్రామ పాదయాత్రల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా యంయస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వై. కే విశ్వనాథ్ చేపట్టిన రెండవ సంగ్రామ పాదయాత్ర మరో రెండు రోజుల్లో మైదుకూరు నియోజకవర్గంలోకి రానున్న నేపథ్యంలో ఈ పాదయాత్రని దిగ్విజయంగా నిర్వహించాలని సమావేశంలో చర్చిడం జరిగింది.


ఈ సమావేశంలో ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు ఈరి జ్వానేస్, మైదుకూరు నియోజకవర్గ యంఈయఫ్ ఇన్చార్జి బి. హరినాథ్ లు మాట్లాడుతూ. మన జిల్లాలో మొదట మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఇడమడక లోకి విశ్వనాథన్న పాదయాత్ర ప్రవేశించి దువ్వూరు, మైదుకూరు బ్రహ్మంగారిమఠం మండలాల మీదుగా బద్వేల్ కు వెళుతుందని చెప్పారు.


ఈ కార్యక్రమంలో ఎంఇఎఫ్ నియోజకవర్గం అధ్యక్షులు సి. ఓబులేసు, మైదుకూరు మండలం యంఈఎఫ్ అధ్యక్షులు యల్లుగాల్ల బాలాజీ, ఆనంద్ రావు, దాసరిపల్లి రాజా, ప్రభాకర్, ఎంఎస్పి జిల్లా నాయకులు జంపంగి జయచంద్ర, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మానికింద వెంకటేష్ మాదిగ, నాయకులు కైపు భాస్కర్ పెర్ణపాటి ఓబన్న, మరియన్న, ఓరుగంటి రామసుబ్బయ్య, యల్లుగాల్ల శ్రీనివాసులు , బాల అంతయ్య, ఎంఎంఎస్ కడప జిల్లా అధ్యక్షురాలు విజయరాణి, కాజీపేట మండల అధ్యక్షుడు చాట్ల భాస్కర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa