ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరిమేలు కోసమో రాజకీయం చేయడానికే పవన్ పార్టీ పెట్టాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 02:00 PM

ఎవరిమేలు కోసమో రాజకీయం చేయడానికే పవన్ పార్టీ పెట్టాడు అని మాజీ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. భారతీయ జనతాపార్టీతో కటింగు టీడీపీతో మెర్జింగ్ ఇదే మచిలీపట్నంలో పవన్ టోటల్ సభ సారాంశం అని తేల్చి చెప్పారు. మోడీ మంచోడు, అమిత్ షా మంచోడు, నడ్డా మంచోడు..కానీ ఏపీలో ఉన్న బీజేపీ వాళ్లు సన్నాసులని పవన్ అంటున్నాడన్నారు. కుల రహితంగా బతకాలి అని ఓ పక్కన చెబుతూ కాపులని రెచ్చగొట్టేలా మాట్లాడటం పవన్ కే చెల్లిందని పేర్ని దుయ్యబట్టారు. కాపులందరికీ జగన్ మీద ప్రేమ ఎందుకు, చంద్రబాబు మీద ద్వేషం ఎందుకు అని పవన్ అడగటం హాస్యాస్ప‌దం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa