జనసేన కార్యకర్తల ర్యాలీలో అపశృతి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో మంగళవారం నిర్వహించిన జనసేన ర్యాలీలో పాల్గొన్న ఓ కార్యకర్త.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చందన ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు.. కంకిపాడు ఎస్సై వెల్లడించారు.
జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విజయవాడ నుంచి వారాహిపై ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో.. పవన్ వెంట్ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. బైక్‌లపై పవన్‌ను అనుసరిస్తూ ర్యాలీగా వెళ్లారు. ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా వందలాది బైక్‌లు రావడంతో.. ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని మృతుడు ఆంజనేయులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa