2023–2024 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను స్పీకర్ అనుమతితో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...2019లో సీఎం వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రెండేళ్ల కోవిడ్‌ను అధికమిస్తూ సీఎం వైయస్ జగన్ ఆశీస్సులతో బడ్జెట్‌ను 4సార్లు వరుసగా ప్రవేశపెట్టాను. ఈ నాలుగేళ్లు కూడా బడ్జెట్‌ను తయారు చేసేందుకు రాత్రింబవళ్లు పని చేశారు. ఈ నాలుగేళ్లు నాతో కలిసి పని చేసిన ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లోని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోతన పద్యాన్ని గుర్తు చేస్తూ..ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నానంటే రాష్ట్రం పట్ల, బడుగు, బలహీనవర్గాల పట్ల సీఎం వైయస్ జగన్‌కు ఉన్న బాధ్యత, ప్రేమ అనే అంశాల ద్వారా ఈ రోజు వరుసగా ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాను అని కొంత బావోద్వేగానికి గురి అయ్యారు.