పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది అని, పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ఇది అని ఆయన కొనియాడారు. వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని, విద్య ఈ ప్రభుత్వం ప్రాధాన్యతా అంశమని ఆయన వెల్లడించారు.