ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తరచూ చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యపట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి, శరీరంలో నీటి కొరత, సరిగా నిద్రలేకపోవడం లాంటి సమస్యలతో తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడూ ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం తాగాలి. తలనొప్పి తగ్గేందుకు కాస్త విశ్రాంతి తీసుకోవాలి, కాసేపు యోగా, ధ్యానం చేస్తే తలనొప్పి సమస్య తగ్గుతుంది.