ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతోపాటు పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించిన సీఎం జగన్... ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా ఎదుట ప్రస్తావించారు. విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి సమర్పించినట్టుగానే, అమిత్ షాకు కూడా విజ్ఞాపన పత్రం అందజేసినట్టు తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa