పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అరెస్ట్ వారెంట్ శుక్రవారం సస్పెండ్ చేయబడింది, ఆయనపై లాహార్, ఇస్లామాబాద్ లో నమోదైన 9 కేసులలో లాహోర్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ తొమ్మిది కేసుల్లో 8 కేసులు ఉగ్రవాద ఆరోపణల కింద నమోదయ్యాయి. ఈ కేసుల్లో మార్చి 27 వరకు ఈ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అంతేకాకుండా ఆయనపై నమోదైన నాన్- బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa