ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగుతోంది. అగ్రశ్రేణి క్రీడాకారులు వరుసగా ఇంటిముఖం పడుతున్న వేళ భారత ఆశలను మోస్తూ యువ జంట గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ సత్తా చాటుతోంది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో గాయత్రి- ట్రీసా జోడీ చైనా జంటపై గెలుపొందింది.