పెద్దకడబూరు మండలంలో 2021 ఏప్రిల్ 1 నుండి 2022 మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలలో కలిపి 704 పనుల్లో ఉపాధి కూలీలు పని చేశారు. అందులో కూలీలకు వేతనాలకు సంబంధించి రూ. 5, 42, 26, 477, మెటీరియల్ కు సంబంధించి రూ. 9, 76, 775 మొత్తం రూ. 5, 52, 03, 252 ఖర్చు చేశారు. దీనిపై ఇటివల పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో సామాజిక తనిఖీ బృందం పర్యటించి సామాజిక తనిఖీ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం మీటింగ్ శుక్రవారం ఆదోని ఉపాధి హామీ పథకం ఆఫీసులో నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలలో కలిపి రూ. 21, 810 ప్రాజెక్ట్ డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి రికవరీకి ఆదేశించారు. మేకడోణలో రూ. 500, దొడ్డిమేకలలో 2153, హెచ్ మురవణిలో 802, పీకలబెట్టలో 1293, గవిగట్టులో 1979, పెద్దకడబూరులో 1141, బసలదొడ్డిలో 2482, కంబదహాల్ లో 969, హనుమాపురంలో 2824, చిన్నతుంళంలో 2896, కల్లుకుంటలో 2694, నౌలేకల్ లో 885, జాలవాడిలో 1192 రూపాయల చొప్పున రికవరీకి ఆదేశించారు. తారాపురం, కంబళదిన్నె గ్రామాలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డీఆర్పీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పిడి సలీం బాషా, విజిలెన్స్ ఆఫీసర్ సిద్ధ లింగమూర్తి , డీవీఓ అసిస్టెంట్ పకీరప్ప , స్టేట్ రిసోర్స్ పర్సన్ వెంకటేష్ నాయక్ , ఆదోని ఏపీడీ లోకేష్ , ఎంపీడీఓ వెంకటరమణప్ప, ఏపీఓ రామన్న, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అన్ని గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.