ప్రభుత్వ యాడ్స్ విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభించిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలియజేసారు. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారని, ఆ యాడ్స్ ద్వారా ఏజెన్సీకి 15 శాతం కమీషన్ ఇచ్చేవారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేశారని, ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి యాడ్స్ ఇచ్చేవారన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం నేరుగా మీడియా సంస్థలకే యాడ్స్ ఇవ్వడం వల్ల రూ.80 కోట్లు ఆదా చేయగలిగామని మంత్రి తెలిపారు.