శాసనసభలో ప్రతిపక్ష నాయకులకి సమాధానం చెప్పలేక స్పీకర్ మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకల్ని సభ నుంచి సస్పెండ్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేయబోతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వ సస్పెన్షన్కు జనం సంసిద్ధులు అయ్యారనడానికి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రామానాయుడు వ్యాఖ్యానించారు.