మైనర్లు వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురి అయితే వాహన యజమాని కూడా ముద్దాయి అవుతాడని ఇంకొల్లు ఎస్సై నాయబ్ రసూల్ వాహనదారులను హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన శనివారం "నో యాక్సిడెంట్స్ డే" డ్రైవ్ చేపట్టారు. రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించక పోవటం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ లు వాహనాలు నడపడం వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తెలిపారు.