ఓ స్కూల్ లోని తరగతి గది భూమిలోకి కుంగి 17 మంది విద్యార్థులు గాయపడిన ఘటన జింబాబ్వేలో జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని హరారేకు 200 కి.మీ దూరంలోని క్వెక్వేలో ఓ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో పెద్దగొయ్యి ఏర్పడి విద్యార్థులు అందులో పడిపోయారు. గాయపడ్డ వారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సమీపంలో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాల వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa