ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత సినిమా దర్శకుల దృష్టి పూర్తిగా మారిపోయింది. దర్శకులు అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లను అందిస్తున్నారు. అయితే కొన్ని వెబ్ సిరీస్‌లు అశ్లీలత, అసభ్యత, హింస వంటి అంశాల్లో హద్దులు దాటుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ కంటెంట్‌పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖలు చేసారు. సృజనాత్మకత పేరుతో అశ్లీలత, బరితెగింపుకు పాల్పడుతున్నారు. అలాంటి విషయాలను చూస్తూ ఊరుకోం. ఓటీటీలో అశ్లీలత పెరిగిపోవడంపై పలు ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. అవసరమైతే ఓటీటీకి సంబంధించి మార్గదర్శకాలు, సెన్సార్‌లు జారీ చేసేందుకు కేంద్రం వెనుకాడబోదని కేంద్ర మంత్రి తెలిపారు.