ఈ నెల 26న జరగాల్సిన SCT SI టెక్నికల్ పేపర్ రాత పరీక్ష హాల్ టికెట్లపై TSLPRB కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21 ఉదయం 8 గంటల నుంచి 24 అర్ధరాత్రి 12 గంటల వరకూ అభ్యర్థులు వెబ్ సైట్ లో తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని సూచించింది. ఒకవేళ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ కాని వారు support@tslprb.inకు మెయిల్ లేదా 9393711110, 9391005006కు ఫోన్ చెయ్యొచ్చు.