పుదీనా నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తాయి. అలర్జీ, ఆస్తమాతో బాధపడేవారికి పుదీనా నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన, బాక్టీరియాను తొలగిస్తుంది. ఈ నీరు తాగితే అజీర్ణ సమస్యలు తొలగిపోయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పుదీనా ఆకుల్లోని మెంథాల్ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.