విజయనగరం జిల్లాలో ఖాళీగా ఉన్న10 అంగన్వాడీ కార్యకర్తలు, 53 అంగన్వాడీ సహాయకులు, మరో 15 మినీ అంగన్వాడీకార్యకర్తల పోస్టులకు సంబంధించి, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సాధికారత అధికారిణి బి. శాంతకుమారి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణత పొందాలని, అలాగే తెలుగు చదవడం, రాయడం బాగా రావాలన్నారు. 01-07-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 11, 500, సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తకు రూ. 7 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 29వతేది సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో అందజేయాలన్నారు.