ఉత్తరాంధ్రలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడింది.ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి ఉండటంతో వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఉమ్మడి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ టీఎస్ఎస్ పాత్రో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.