అమెరికాకు చెందిన ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది. నెవాడాలో 39 ఏళ్ల కోరా డ్యూక్ 2001లో పదిహేడేళ్ల వయసులో తొలిసారి గర్భం దాల్చింది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త ఆండ్రే డ్యూక్‌తో పాటు 8 మంది సంతానంతో కలిసి నివసిస్తోంది. వీరికి పుట్టిన మూడో సంతానం ఏడు రోజులకే కన్నుమూసింది. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.