మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టటం వల్ల మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8-10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. పూల దిగుబడి పెంచడానికి లీటరు నీటికి 2.5 గ్రా.ల జింక్ సల్ఫేట్, 5 గ్రా.ల మెగ్నీషియం సల్ఫేట్ సూక్ష్మధాతువులను కలిపి రెండు, మూడు ధఫాలుగా పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి సుమారు 3-4 టన్నుల దిగుబడి పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa