ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 01:01 PM

ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం పలు శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించనుంది. 10 సవరణ బిల్లులను సభలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. శాస‌న స‌భ‌లో టీడీపీ నేత అచ్చెన్నాయుడి భాష స‌రిగా లేద‌ని మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో మంత్రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. జీవో నెం1 అందరికీ వర్తిస్తుందని మంత్రి స్ప‌ష్టం చేశారు. అలానే ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాద‌ని మంత్రి అంబటి రాంబాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa