కుప్పంలోని సుమారు 60 కుటుంబాలు సోమవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కుప్పం పట్టణానికి చెందిన దళిత నాయకుడు కన్నన్ ఆధ్వర్యంలో ఈ కుటుంబాలకు చెందిన యువకులు అమరావతి వెళ్లారు. అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు స్వయంగా కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. ఈ మార్పు వైసీపీని పతనం చేసికాని వదలదన్నారు. వారివెంట టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి పీఎస్ మునిరత్నం ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa