శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జితో ప్రజల కష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రైల్వే బ్రిడ్జి నిర్మిస్తే అది ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఈ ప్రాంతంలో వర్షం పడితే రైల్వే అండర్ బ్రిడ్జి కింద మోకాటి లోతు నీళ్లు నిలిచిపోతాయి. దీంతో ప్రజలు, వాహనచోదకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత రైల్వే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.