ముమ్మిడివరం మండలం కమినిలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి 5 సెంట్లు స్థలాన్ని ఇచ్చిన దాత తాడి నరసింహారావు దంపతులు ఈ పూజ చేశారు. దళిత గోవిందం పథకంలో తితిదే రూ. 10 లక్షలు, దాతల సహకారంతో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సర్పంచి సీత, రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa