ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలోని బోయ, వాల్మీకిలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 08:57 AM

 బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ బిల్లును  శుక్రవారం అసెంబ్లీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... రాష్ట్రంలోని బోయ, వాల్మీకిలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. పలు రాష్ట్రాల్లో ఈ కులాలు ఎస్టీ జాబితాలో ఉన్నాయి.  మెజారిటీ బోయ, వాల్మీకిలో 47 శాతం  మందికి భూమి లేదు. 45 శాతం మంది చిన్న సన్నకారు రైతులు. వారి ఆధీనంలో 27 శాతం మాత్రమే నీటి ఆధారితంగా ఉన్నాయి. 73 శాతం వీరి భూములు వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. కుటుంబ పెద్దలు నిరక్షరాస్యత 77 శాతం ఉంది. 61 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీరికి కుల సంబంధిత వృత్తి లేని కారణంగా వేసవి కాలంలో వలసలు వెళ్తుంటారు. దాదాపుగా 79 శాతం కుటుంబాలు రెండు లేదా అంతకంటే తక్కువ గదులు ఉన్న గృహాల్లో నివహిస్తున్నారు. ఇప్పటికీ 16 శాతం పూరిళ్లలో నివసిస్తున్నారు. 45 శాతం మందికి ఇప్పటికీ టాయిలెట్స్‌ లేవు. 80 శాతం కుటుంబాలకు వార్షిక ఆదాయం లక్ష రూపాయల కంటే తక్కువే. దాదాపు 8.6 శాతం కుటుంబాల వార్షిక ఆదాయం రూ.20 వేల కంటే తక్కువ. కుటుంబాలు 39 శాతం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటాయి. 42 శాతం మొత్తం కుటుంబం వలసలు వెళ్లినట్లు తెలిసింది. ఈ సామాజిక, ఆర్థిక విశ్లేషణను సమాజంలో ఆర్థిక విద్య వెనుకబాటుతనాన్ని వెల్లడి చేసింది. వారి సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మార్పులు తీసుకురాలేదు. బోయ, వాల్మీకి సామాజిక వర్గాల్లోని డిమాండ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ సామాజిక వర్గం కర్ణాటకలో ఎస్టీ జాబితాలో చేర్చారు. ఏపీలోని అనంతపురం, కర్నూలు, వైయస్‌ఆర్‌ జిల్లా, చిత్తూరు జిల్లాల్లో బోయ, వాల్మీకిలను షెడ్యూల్‌ తెగల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నాం. వాస్తవాల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com