షెడ్యూల్డ్ కులాల కుటుంబాల అభివృద్ధి, సంక్షేమానికి నవరత్నాలు, ఇతర పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.32,327 కోట్లతో 122.56 లక్షల మందికి, నాన్ డీబీటీ ద్వారా 18,967 కోట్లతో 52.4 లక్షల మందికి లబ్ధిచేకూర్చినట్టు మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. సీఎం వైయస్ జగన్‌లో ఉన్న గొప్ప ఆలోచన రాష్ట్రంలోని ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూపాయి సహాయం అందాలంటే సిఫార్సులు, చిన్న లోన్ రావాలంటే పలుకుబడి ఉన్న కుటుంబం దగ్గరకు వెళ్లి అడుక్కునే పరిస్థితి ఉండేదని, కానీ, ఇప్పుడు ఎవ్వరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న వారందరికీ అన్నీ అందుతున్నాయన్నారు.