ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 10:47 AM

రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే...  సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముండ్లవారిపల్లెకు చెందిన వెంకటేష్‌(34)తినుబండారాలు తయారు చేస్తుండేవాడు. ఈనేపథ్యంలో కొద్దిరోజుల కిందట మదనపల్లెకు వచ్చి స్థానిక ఓ బేకరీలో స్వీట్లు తయారు చేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ బేకరీలో స్వీట్లు తయారు చేసేందుకు ప్యాసింజర్‌ ఆటోలో బయలుదేరాడు. దారిలో మదనపల్లె మండలం పుంగనూరురోడ్డులోని పాత ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఘటనలో డ్రైవర్‌ పక్కన కూర్చొని వున్న వెం కటేష్‌ ఎగిరి రోడ్డుపై పడడంతో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న చంద్ర కళ(40), డ్రైవర్‌ సురేష్‌(27)లు తీవ్రంగా గాయపడ్డారు. గమ నించిన స్థానికులు ఘటనపై తాలూకా పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. కాగా ఘటనాస్థలిలో పడివున్న మృతుడి సెల్‌ఫోన ఆధారంగా ముండ్లవారిపల్లెకు చెందిన వెంకటేష్‌గా నిర్థారణ చేసి బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈక్రమంలో టెంపోను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకుని స్టేషనకు తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa