నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించడానికి ఈనెల 28వ తేదీ ఉదయం 9గంటలకు రాజమహేంద్రవరం లోని స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.హరీష్ చంద్రప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, జేడీఎం కేశవులు తెలిపారు. ప్రముఖ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, పరమేశు బయోటెక్, విజన్ డ్రగ్స్, అమర రాజా గ్రూప్, ఐసాన్, అపోలో ఫార్మసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ డైరీ ఎక్విప్‌మెంట్ అండ్ ఫ్యాబ్రికేటర్స్, ముత్తూట్ ఫైనాన్స్, కీర్తన పైనాన్స్, పేటీఎం కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఏదైనా పీజీ, బీటెక్, ఫార్మసీ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంటర్, పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు మరింత సమాచారం కోసం 89198 68419, 95818 10049 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa