నాగాయలంక గ్రామ సచివాలయం -2లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొని గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించారు. గడపగడపకు తిరుగుతున్న సమయంలో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేసి పథకాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం యువ నాయకులు వికాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa