ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం లో భాగంగా క్రైస్తవులు గా మతం మార్చుకున్న హిందూ దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రచార ప్రముఖ్ చిన్న మాతంగి శ్రీనివాస్ అన్నారు.ఈ తీర్మానాన్ని నిరసిస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్నిశనివారం అందజేశారు. బజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ పోలేపల్లి సందీప్ మాట్లాడుతూ మన దేశంపై ఆధిపత్యానికి ఒకనాటి మన పాలకులైన ముస్లింలు , క్రైస్తవులు తమ పాలనను పటిష్టం చేసుకునేందుకు మతమార్పిడులను ఉపయోగించారని. కత్తి చూపి, భయపెట్టి, కాసులు చూపి, విద్య మరియు సేవల పేరుతో మతమార్పిడులు కొనసాగించారన్నారు. అదే పంథా లో ఇప్పటి పాలకులు అమాయక హిందూ దళిత సోదరులకు అన్యాయం చేసే తీర్మానాలు చేసి దళిత ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు.
పట్టణ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలతో ఆడుకోరాదని, ఈ తీర్మానం వల్ల మతమార్పిడులకు ప్రోత్సహం ఇచ్చినట్లు అవుతుందని మరోసారి హెచ్చరిస్తూ, విశ్వ హిందూ పరిషత్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మరో ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్వహించడానికి వెనుకాడబోదని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శేష సాయి , శంకరయ్య , నాగిరెడ్డి , వరప్రసాద్, నాగరాజు , శ్రీకాంత్ , సూరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa