ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల అభ్యున్నతే సమాజం ప్రగతికి కొలమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 05:39 PM

 మ‌హిళా సంక్షేమం కోసం దేశంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌నంత కృషిసీఎం జగన్  చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని  ఫార్చ్యూన్ గ్రాండ్ లో   వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మ‌హిళా విభాగం స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి పాల్గొని  2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ విజయం సాధించి జగనన్న ను రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు మహిళా విభాగం క్రియాశీలకంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మహిళలు మానవాళిలో సగభాగమే కాకుండా, అభివృద్ధిలో అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ‘మహిళల అభ్యున్నతే సమాజం ప్రగతికి కొలమానమ‌న్నారు.  2019లో వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింద‌న్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa