జగన్ ప్రభుత్వమా అంటే మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని చెప్పారు. మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వమని వివరించారు. కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనదని నొక్కి చెప్పారు. ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది అన్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా ముందు కెళ్తున్నామని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా, డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా..నేను విన్నాను... నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా..ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో శనివారం ఏర్పాటు చేసిన వైయస్ఆర్ ఆసరా మూడో విడత కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa