తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడు జన్మదిన వేడుకలు మోపిదేవిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మోపిదేవిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేకును గ్రామ పార్టీ అధ్యక్షులు కావూరి రామకృష్ణ, మండల టిడిపి అధ్యక్షులు నడకుదురు జనార్దన్ రావు, పార్టీ సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు లుకట్ చేసి, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కోకిలగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు విశ్వం శెట్టి రాజా, బీసీ సెల్ మండల అధ్యక్షులు కందుల బసవయ్య, తెలుగు రైతు జిల్లా అధికార ప్రతినిధి గవిని శివరామకృష్ణ, పార్టీ నాయకులు పుప్పాల ఏసు, పుట్టి శ్రీనివాసరావు, నందిగం శంకర్, కనకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు