ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పాశ్చాత్య దేశాలతో రష్యాకు ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుసార్లు పుతిన్ అణ్వస్త్ర ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉంచే యోచనలో ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ఐరోపాలోని పలు దేశాల్లో నాటో కూటమి ఇప్పటికే అణ్వాయుధాలను మోహరించింది. దానికి వ్యతిరేకంగానే పుతిన్ తాజాగా ఈ చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోంది.