ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ (యుఎస్‌బిఆర్‌ఎల్) పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత జమ్మూ-కాశ్మీర్‌లోని జమ్మూ-శ్రీనగర్ మధ్య వందే భారత్ మెట్రో రైలు నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ వంతెనపై ట్రాక్-మౌంటెడ్ ట్రాలీ మొదటి రన్‌లో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరి 2024 నాటికి USBRL ప్రాజెక్ట్ పూర్తవుతుందని చెప్పారు.వైష్ణవ్ రైల్వే అధికారులతో కలిసి ట్రాక్-మౌంటెడ్ ట్రాలీపై ప్రయాణించి చీనాబ్ నదీగర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఐకానిక్ వంతెనను పరిశీలించారు.