తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి కానుకగా జనవరి 15న వందేభారత్ రైలును ప్రారంభించారు. దేశంలో 8వ వందే భారత్ రైలు ఇది. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ఇది ప్రయాణిస్తుంది. వందే భారత్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. ఈ రైలు కేవలం 140 సెకన్ల సమయంలో 160 కి.మీ. వేగం అందుకుంటుంది. దేశంలో 2019లో తొలి వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ - వారణాసి మార్గంలో ఈ రైలును ప్రారంభించారు.