పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం పూర్తి రిజర్వాయర్ ఎత్తు 45.72 మీటర్లు అని తెలిపింది. పోలవరం ఎత్తు తగ్గించాలని తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.