రాజస్థాన్‌లోని ప్రైవేట్ వైద్యులు రాష్ట్ర ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం జైపూర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వేలాది మంది వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, మెడికల్ షాపు యజమానులతో పాటు వైద్య వృత్తికి సంబంధించిన వారు పాల్గొన్నారు. ప్రైవేట్ వైద్యుల నిరసనతో ప్రైవేట్ ఆస్పత్రి, నర్సింగ్‌హోమ్‌లు మూతపడడంతో ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల రద్దీ నెలకొంది. ప్రైవేటు వైద్యులకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు రెండు గంటల పాటు విధులు బహిష్కరించడంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు దెబ్బతిన్నాయి.అంతకుముందు, రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరసనల మధ్య ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రజలకు ఉచిత అత్యవసర చికిత్స హక్కును కల్పించే బిల్లును ఆమోదించింది.దీంతో వారి పనితీరులో అధికార యంత్రాంగం జోక్యం పెరుగుతుందని ప్రైవేటు వైద్యుల అభిప్రాయం.