ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లా కలమంజన్ గ్రామంలో సోమవారం ఉదయం ముగ్గురిపై పులి దాడి చేసింది. గ్రామస్తులు కట్టెలు సేకరించేందుకు అడవికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో గాయపడిన ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పులి దాడి గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. ప్రాణహాని ఉన్నందున పాఠశాలలు, అంగన్వాడీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.