‘ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అవి ప్రజల నిర్ణయం మేరకు ఉంటాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందాం. మా పార్టీపై వ్యతిరేకత ఉందని అవగాహన వచ్చింది అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అయినా మాకు ఏడాది సమయం ఉంది. మా తప్పులను సరిదిద్దుకుంటూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తాం’.. అని తెలిపారు. పార్టీ నుంచి సస్పెండైన వారు పశ్చాత్తాప పడకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. మంత్రి పదవి దక్కని కారణంగా ఆనం రామనారాయణరెడ్డిలో ఆవేదన రగిలిందని.. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముందుగానే ప్లేటు ఫిరాయించారని విమర్శించారు. అటు బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సైతం.. అంతా సీఎం చూసుకుంటారని భావిస్తే ఇబ్బందుల్లో పడతామని పార్టీ కార్యకర్తలతో అన్నారు. మా మంచి సీఎం అని మనమంతా గర్వపడితే సరిపోదని.. అందరూ ఓట్లు వేస్తేనే మళ్లీ సీఎం సీట్లో జగన్ కూర్చుంటారని ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా అయన మాట్లాడారు.