నాసిరకం మందుల కారణంగా దేశంలోని 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 76 కంపెనీలను తనిఖీ చేసి 18 కంపెనీల లైసెన్సులను సస్పెండ్ చేశామని, 26 ఔషధాల నాణ్యత లేని కారణంగా షోకాజ్ నోటీసును అందజేశామని మంగళవారం ఒక ఉన్నత అధికారిక వర్గాలు తెలిపాయి. మూడు ఫార్మా కంపెనీల ఉత్పత్తుల అనుమతిని కూడా కేంద్రం రద్దు చేసింది. కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 20 రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. దేశంలో నాసిరకం మందుల ఉత్పత్తిని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.