గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీలో కనుకల ద్వారా భక్తులు సమర్పించిన ఆదాయం రూ 43. 10 లక్షలు లభించినట్లు ఆలయ ఈఓ వేంకటేశ్వర రెడ్డి తెలిపారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కనుకల హుండీల లెక్కింపు మంగళవారం ఆలయంలో చేపట్టారు. గడచిన 49 రోజులకు భక్తులు హుండీలో సమర్పించిన కనుకల ఆదాయం రూ43, 10, 744 నగదు, అన్నదాన హుండీ ద్వారా రూ 52, 260 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. అదేవిధంగా బంగారు 0. 004 గ్రాములు, వెండి 1. 309 కిలోలు భక్తులు సమర్పించినట్లు ఈఓ తెలిపారు. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అనువంశిక సభ్యులు సుగుణమ్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.