కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు ఉన్నo మారుతి చౌదరిని మంగళవారం అర్థరాత్రి అనంతపురంలో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. రైతులకు సబ్సిడీతో అందించే వ్యవసాయ పంపుసెట్లను అధికార పార్టీ వ్యక్తులు అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో రావడంతో అడ్డుకునేందుకు శెట్టూరు మండలం లక్ష్మoపల్లికి వెళ్లిన మారుతి చౌదరిని అరెస్ట్ చేయడంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం పై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంత రాయ చౌదరి మండి పడ్డారు.